గ్యాస్ సబ్సిడీ నిలిచిపోకుండా తక్షణమే ఈ కేవైసీ పూర్తి చేయాలి

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

తెలంగాణలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సబ్సిడీని నిరంతరాయంగా పొందాలంటే వినియోగదారులు తక్షణమే బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్‌తో పాటు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి ఇప్పటికే జూలై నుంచే సబ్సిడీ నిలిచిపోయిందని, బోగస్ లబ్ధిదారులను ఏరివేసేందుకే ప్రభుత్వం ఈ విధానాన్ని తప్పనిసరి చేసిందని వెల్లడించింది.