రూపాయల వందల కోట్ల కేసులో కోర్టుకు నోరా ఫతేహి: కీలక విషయాలు వెల్లడి

రిపోర్టర్: అశోక్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సుకేశ్ చంద్రశేఖర్ కేసు విచారణలో భాగంగా బాలీవుడ్ నటి నోరా ఫతేహి కీలక సాక్ష్యం చెప్పారు. లీనా మరియా పాల్స్ నిర్వహించిన ఈవెంట్ ద్వారానే తాను సుకేశ్ తో మాట్లాడినట్లు కోర్టుకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తనకు ఎటువంటి పారితోషికం అందలేదని, కేవలం ప్రయాణ ఖర్చులు మాత్రమే భరించారని నోరా ఫతేహి స్పష్టం చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.