రైతు వేదికలో మునగ సాగు మెలకువలు వివరించిన అధికారులు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలం రఘునాథపురం రైతు వేదికలో మునగ సాగుపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయాధికారులు మునగ సాగు విధానం, లాభాలు, తోటల పెంపకానికి దరఖాస్తు చేసుకునే పద్ధతులను రైతులకు వివరించారు. దత్తాయపల్లి రైతులు మునగ ఉత్పత్తులతో చేసిన పదార్థాలను ప్రదర్శించారు. సదస్సులో పాల్గొన్న యాభై మంది రైతులకు ప్రత్యేక కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.