రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0 కార్యక్రమం ప్రారంభం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: కృష్ణా

గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వెల్లడించారు. రూ.11,085 కోట్ల భారీ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, రైతు సంక్షేమం, పారిశుద్ధ్యం మరియు ఉద్యాన అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నిధుల ద్వారా పల్లెల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, స్థానిక ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.