సికింద్రాబాద్‌లో మెడికల్ క్యాంప్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
సికింద్రాబాద్‌లో ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంప్‌ను కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షల నిమిత్తం విచ్చేసిన రోగులను ఆప్యాయంగా పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు ఉచితంగా అవసరమైన వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందేలా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు.