వైకాపాకు భారీ షాక్: చీపురుపల్లిలో పలు కుటుంబాల సామూహిక రాజీనామాలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: చీపురుపల్లి

చీపురుపల్లిలో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నాయకుడు కంది రామకృష్ణతో పాటు పది కుటుంబాలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాయి. మజ్జి శ్రీనివాసరావుకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. త్వరలోనే ఎమ్మెల్యే కళా వెంకటరావు సమక్షంలో తెదేపాలో చేరనున్నట్లు కంది రామకృష్ణ మీడియా సమావేశంలో వెల్లడించారు. పార్టీ వీడిన వారిలో పలువురు బూత్ కమిటీ నాయకులు కూడా ఉన్నట్లు స్పష్టమైంది.