ఒంగోలులో హాస్టల్ బాలికపై లైంగిక దాడి కలకలం

రిపోర్టర్: రమేష్ స్థలం: ప్రకాశం

ఒంగోలులో హాస్టల్ బాలికల పట్ల వంటమనిషి అమానుషంగా ప్రవర్తించి రిటైర్డ్ ఉద్యోగి వెంకట్రావు ఇంటికి పంపగా, ఆయన ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని స్థానికులు మరియు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మంత్రి సవిత తీవ్రంగా స్పందించి నిందితుడు వెంకట్రావుపై పోక్సో కేసు నమోదు చేయించారు. వార్డెన్ తేరేసమ్మకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతోపాటు వంటమనిషి శారదను సస్పెండ్ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.