లంకెలపాలెం బ్రిడ్జిపై లారీ సామగ్రి పడి ఇద్దరికి తీవ్ర గాయాలు

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంకెలపాలెం బ్రిడ్జిపై శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ నుంచి క్రేన్ సామగ్రి ఒక్కసారిగా కింద పడటంతో, ఆ సమయంలో బైక్పై వెళ్తున్న నూకరాజు, షేక్ మదీనా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.