ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు
రిపోర్టర్: శివ
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రెండు నుంచి మూడు రోజులలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో తుఫాను ముప్పు పొంచివుంది. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.