యువత ఉత్సాహం కోసం క్రికెట్ కిట్లు అందజేత

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కార్వేటినగరం

గంగాధరనెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం గాజంకి పంచాయతీ పరిధిలోని గాజంకి హరిజనవాడ గ్రామ యువతకు జనసేన పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు చంద్ర మౌళి క్రికెట్ కిట్ను అందజేశారు. ఈ సందర్భంగా యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని తమలోని ప్రతిభను వెలికితీసి ఉన్నత స్థాయిలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడవచ్చని చంద్ర మౌళి తెలిపారు.