జీ5 వేదికగా ఆక్టోపస్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ రాక

రిపోర్టర్: అశోక్ స్థలం: చెన్నై

తమిళ జీ5 ఒరిజినల్ సిరీస్‌గా జయచంద్ర హష్మీ దర్శకత్వంలో ఆక్టోపస్ అనే ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. అశ్విన్, అర్చన, వినోత్ కిషన్, సిద్ధు కుమరేశన్, కలైవాణి భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ఏడు ఎపిసోడ్ల సిరీస్ ఓ యువతి అదృశ్యం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రానికి లాయిడ్ సి. జేవియర్ బిజినెస్ హెడ్‌గా వ్యవహరిస్తుండగా, ఇప్పటికే విడుదలైన లాంచ్ ప్రోమో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది.