టాలీవుడ్ హారర్ థ్రిల్లర్ హత సినిమా విడుదల వాయిదా
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Hyderabad
టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం సమర్పణలో రాబోతున్న హారర్ థ్రిల్లర్ హత సినిమా విడుదల వాయిదా పడినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను నవంబర్ ఆరున గ్రాండ్గా విడుదల చేయాలని భావించినప్పటికీ, అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రేక్షకులకు ఉత్తమమైన థియేట్రికల్ అనుభవాన్ని అందించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, కొత్త విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని మూవీ టీమ్ స్పష్టం చేసింది.