కేరళలో భావోద్వేగం: బస్సును ముద్దాడి వీడ్కోలు పలికిన డ్రైవర్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: కేరళ

కేరళలో ఆర్టీసీ డ్రైవర్ పాల్ కురియన్ తన వృత్తి పట్ల చూపిన అంకితభావం అందరినీ కదిలిస్తోంది. 18 ఏళ్లుగా సేవలందించిన ఆయన, చివరి రోజున తాను నడిపిన బస్సును ముద్దాడి భావోద్వేగంతో వీడ్కోలు పలికారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కురియన్ నిబద్ధతను కేరళ సీఎం సైతం అభినందించారు. వృత్తిని దైవంగా భావించే ఇలాంటి మనుషులు నేటికీ ఉండటం స్ఫూర్తిదాయకం.