భక్తిశ్రద్ధలతో వినాయక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద బీఆర్ఎస్ మాజీ ఉపసర్పంచ్ కుక్క రాంచందర్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, వార్డు సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు.