అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణం: శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

అమరావతిని అంతర్జాతీయ సాంకేతిక హబ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధానిలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణాలకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్తో కలిసి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఉద్దండరాయునిపాలెం పరిధిలోని 11 ఎకరాల్లో 47 అంతస్తులతో అత్యంత ఆధునిక జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ టవర్లను నిర్మిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.