అశాస్త్రీయ స్పీడ్ బ్రేకర్లతో ముప్పు: ఆధునిక టెక్నాలజీతోనే ప్రజల ప్రాణాలకు రక్షణ

రిపోర్టర్: సతీష్ స్థలం: Hyderabad

దేశంలోని రోడ్లపై అశాస్త్రీయంగా వేస్తున్న సిమెంటు స్పీడ్ బ్రేకర్లతో ప్రయాణికుల నడుములు విరిగిపోతున్నాయని, ప్రజల వెన్నుపూసలు విరగ్గొట్టే ఈ కాంక్రీట్ గుట్టలకు స్వస్తిచెప్పాలని రవాణా నిపుణులు కోరుతున్నారు. ద్విచక్ర వాహనదారుల్లో డిస్క్ సమస్యలు పెరుగుతున్నాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్ ద్రవరూప బంప్లు, ఇంటెలిజెంట్ సెన్సర్లు, స్మార్ట్ కెమెరాల వంటి ఆధునిక సాంకేతికతను మన నగరాల్లోనూ అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.