హత్రాస్ లో దారుణం రిటైర్డ్ సైనికుడు భార్య హత్య
రిపోర్టర్: మహేష్
స్థలం: హత్రాస్
ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ లో రిటైర్డ్ సైనికుడు షంసుద్దీన్ మరియు ఆయన భార్య సాద్దో బేగం లు తమ ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారని పోలీసులు తెలిపారు. ఆగ్రా బైపాస్ సమీపంలోని నివాసంలో పదునైన ఆయుధంతో వారిద్దరి గొంతులు కోసి దారుణంగా హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘోర హత్యల వెనుక గల అసలు కారణం ఇంకా తెలియరాలేదని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఐదు బృందాలను రంగంలోకి దించినట్లు ఎస్పీ చిరంజీవ్ నాథ్ సిన్హా పేర్కొన్నారు.