మంచిర్యాల వైద్య కళాశాలలో పారా మెడికల్ దరఖాస్తుల గడువు పెంపు
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో పారా మెడికల్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాల దరఖాస్తు గడువు ఈ నెల పదమూడో తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కళాశాలలో వంద రూపాయలు చెల్లించి దరఖాస్తు ఫారం పొందవచ్చునని పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను అదే రోజు సాయంత్రం ఐదు గంటల లోపు సమర్పించాలని సూచించారు.