ఘోషా ఆసుపత్రిలో సిబ్బంది వసూళ్ల దందాపై తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: శివ స్థలం: విజయనగరం

విజయనగరం ఘోషా ఆసుపత్రిలో ప్రసవాల తర్వాత దిగువ స్థాయి సిబ్బంది డబ్బుల కోసం బాలింతల కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ ప్రసవం జరిగి ఆడబిడ్డ పుట్టినా రూ.600 డిమాండ్ చేస్తున్నారని, ఫోన్ పే వద్దు నగదే ఇవ్వాలని సిబ్బంది బలవంతం చేస్తున్నారని రోగుల బంధువులు ఆరోపించారు. ఈ అక్రమ వసూళ్లపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని మహారాజా సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకురాలు అల్లు పద్మజ తెలిపారు.