అమెరికా ఎన్నికల్ లో సంచలనం: ఫుల్టన్ కౌన్సిల్ స్థానాన్ని కైవసం చేసుకున్న రోహిత్
రిపోర్టర్: వెంకట్
స్థలం: జార్జియా
అమెరికాలోని జార్జియాలో జరిగిన ఫుల్టన్ కౌంటీ కమిషన్ ప్రత్యేక ఎన్నికల్ లో భారతీయ-అమెరికన్ డెమొక్రాట్ రోహిత్ మల్హోత్రా ఘనవిజయం సాధించారని ఎన్నికల అధికారులు వెల్లడించారు. నలుగురు అభ్యర్థులు బరిలో నిలవగా దాదాపు మూడింట రెండు వంతుల ఓట్లతో ఆయన అఖండ విజయం సొంతం చేసుకున్నారు. గతంలో ఒబామా ప్రభుత్వ హయాంలో వైట్ హౌస్ ఫెలోగా పని చేసిన రోహిత్ గెలుపుతో స్థానిక ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.