కోల్‌కతాలో ఫుడ్ సేఫ్టీ దాడులు: 40 రెస్టారెంట్లపై చర్యలు
రిపోర్టర్: విజయ్
స్థలం: పశ్చిమ బెంగాల్
కోల్‌కతాలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్వహించిన ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన నైజామ్స్, కరీమ్స్ వంటి ప్రముఖ రెస్టారెంట్లు సహా సుమారు 40 తినుబండారాల కేంద్రాలపై చర్యలు తీసుకున్నారు. అపరిశుభ్ర వాతావరణం, గడువు ముగిసిన పదార్థాలు, కుళ్ళిన మాంసం నిల్వలను గుర్తించి సుమారు 1,224 కిలోల ఆహారాన్ని సిబ్బంది పారవేశారు.