జగిత్యాలలో ప్రశాంతంగా కొనసాగుతున్న మూడో రోజు గణేష్ నిమజ్జనోత్సవాలు

రిపోర్టర్: మహేష్ స్థలం: జగిత్యాల

జగిత్యాల జిల్లాలో గణేష్ నిమజ్జనోత్సవాలు మూడవ రోజు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అత్యంత ప్రశాంతంగా కొనసాగుతున్నాయని SP JAGTIAL వెల్లడించారు. శోభాయాత్ర మార్గాలు మరియు ఇమ్మర్షన్ పాయింట్ల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించామని, ప్రజల సహకారంతో ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని SP JAGTIAL పేర్కొన్నారు.