తిరుమల భక్తులకు అలర్ట్: జనవరి నెల ఆర్జిత సేవల టికెట్ల షెడ్యూల్ విడుదల

రిపోర్టర్: సతీష్ స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్న తరుణంలో జనవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా టికెట్ల విడుదల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. శుక్రవారం తిరుమలలో డెబ్బై ఏడు వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రెండు కోట్ల తొంబై ఆరు లక్షలకు చేరుకుందని టీటీడీ వెల్లడించింది.