రెంజల్ మండల కేంద్రంలో మోస్తరు వర్షం.. ఆందోళనలో ఉన్న రైతులకు దక్కిన ఊరట

రిపోర్టర్: G SUDHEER KUMAR స్థలం: రంజల్

రెంజల్ మండల కేంద్రంలో గురువారం మోస్తరు వర్షం కురిసింది. గత రెండు నెలలుగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్న రైతులకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది. వర్షాధారంగా సాగు చేసే రైతులు వాన కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, ఈ వర్షంతో వాతావరణం చల్లబడింది. కురిసిన వర్షం పంటలకు కొంతమేర ప్రయోజనం చేకూర్చడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసి పంటలకు మేలు జరగాలని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.