కాకినాడలో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు: నేరస్తులకు కఠిన హెచ్చరికలు
రిపోర్టర్: రమేష్
స్థలం: Kakinada, Andhra Pradesh
కాకినాడ ఎస్పీ జి. బిందు మాధవ్ అర్ధరాత్రి నగరంలో ఆకస్మికంగా పర్యటించి గస్తీ విధులను, వాహనాల తనిఖీలను పరిశీలించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, నేరస్తులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని, గస్తీని మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.