చిల్లర వివాదం: బస్సు టైర్ల కింద పడి కండక్టర్ ప్రవళిక దుర్మరణం

రిపోర్టర్: సునీల్ స్థలం: భద్రాచలం కొత్తగూడెం

భద్రాచలం కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద బస్సులో చిల్లర విషయంలో జరిగిన వివాదంలో తోయడంతో కాలుజారి బస్సు టైర్ల కింద పడి తీవ్రంగా గాయపడిన మణుగూరు డిపో ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ ఘటన ఆర్టీసీ ఉద్యోగుల్ లో తీవ్ర విషాదాన్ని నింపగా, ఆమె కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు తల్లికి ఉద్యోగం కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు.