ఢిల్లీ వీధుల్లో నిరసనకారులపై లాఠీఛార్జ్: ది న్యూస్ మినిట్ సంచలన కథనం
రిపోర్టర్: నరేష్
స్థలం: Delhi
అక్టోబర్ పదో తేదీన జంతర్ మర్ వద్ద నిరసనకారులను అణచివేసేందుకు సీనియర్ అధికారి మహిళా పోలీసులను ముందుంచాలని ఆదేశించినట్లు ది న్యూస్ మినిట్ వెల్లడించింది. ఆందోళనకారులపై లాఠీలను ఎలా ఉపయోగించాలో ఆయన స్వయంగా ప్రదర్శించి చూపినట్లు పేర్కొంది. ఆ ప్రాంతంలో అక్టోబర్ తొమ్మిది, పదో తేదీల్లో నెలకొన్న హింసాత్మక ఘటనలు, ఉద్రిక్త పరిస్థితులపై ఆ సంస్థ క్షేత్రస్థాయి పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది.