ప్రభుత్వ సేవలకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, సబ్సిడీల లబ్ధికి ఆధార్ కార్డు ఇకపై తప్పనిసరి కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్‌ను కేవలం స్వచ్ఛంద ప్రాతిపదికన మాత్రమే తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ లేదనే కారణంతో ఏ ఒక్కరికీ సేవలు నిరాకరించరాదని, ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులను పరిగణలోకి తీసుకోవాలని తేల్చిచెప్పింది. దివ్యాంగుల సర్టిఫికెట్ల జారీలోనూ ఈ నిబంధన కచ్చితంగా వర్తిస్తుందని వెల్లడించింది.