శ్రీకాకుళం జిల్లాలో వరద ఉధృతిలో కొట్టుకుపోయిన ఎమ్మెల్యే మరియు కలెక్టర్
రిపోర్టర్: రమేష్
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లాలో వరద పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, కలెక్టర్, ఎస్పీ ప్రయాణిస్తున్న బోటు ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో వారు నీటిలో కొట్టుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తక్షణమే స్పందించి తాళ్ల సహాయంతో వారిని రక్షించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.