అక్రమ అరెస్టు నిర్బంధం ముగిసి మూడేళ్లు: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
అక్రమ అరెస్టు నుంచి విడుదలై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. నిర్బంధంతో తనను ఒంటరిని చేయాలనుకున్న వైకాపా పాలకుల కుట్రలు తెలుగుజాతి తిరుగుబాటుతో బద్దలయ్యాయని ఆయన పేర్కొన్నారు. నియంతల అణచివేతను ధిక్కరించి తెలుగుజాతి చూపిన చొరవ తనను నిలబెట్టిందని తెలిపారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు వెల్లడించారు.