యాదగిరిగుట్ట రహదారిపై బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట యాదగిరిగుట్ట రహదారిపై పట్టణ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మీనాక్షి ఫంక్షన్ హాల్ వద్ద ఒక కార్యక్రమంలో పాల్గొని వస్తున్న వారి బైక్ను మరో బైక్ ఎదురుగా వచ్చి బలంగా ఢీకొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.