అట్లాంటా పిల్లల కోసం కోకో గాఫ్ ఉదార విరాళం

రిపోర్టర్: శివ స్థలం: అట్లాంటా

ప్రముఖ టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ యుఎస్ ఓపెన్ నిరాశ తర్వాత కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అమెరికాలోని అట్లాంటాలో ఉన్న ఈస్ట్ అట్లాంటా కిడ్స్ క్లబ్ ఆధ్వర్యంలో టెన్నిస్ మరియు బాస్కెట్ బాల్ కోర్టుల పునరుద్ధరణకు ఆమె భారీ విరాళం అందజేశారు. దెబ్బతిన్న క్రీడా ప్రాంగణాలను అందమైన డిజైన్లతో తీర్చిదిద్దడంతో పాటు చిన్నారుల కోసం సరికొత్త పార్క్ పరికరాలను ఏర్పాటు చేసి తన మంచి మనసు చాటుకున్నారు.