ప్రభుత్వ భూముల కబ్జా పర్వం: అక్రమ సాగుకు విద్యుత్తు కనెక్షన్ల మంజూరు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: చిల్లకూరు
చిల్లకూరు మండలం ఓడూరులో ప్రభుత్వ భూములను ఆక్రమించి సాగు చేస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారుల అండదండలతో డిస్కం అధికారులు వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు మంజూరు చేసినట్లు స్థానికులు మండిపడ్డారు. శాగడా పోరంబోకుతోపాటు పట్టా భూములను కబ్జా చేసి నిమ్మ, జామాయిల్ సాగు చేస్తున్నారని పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు ఎన్ఓసీ జారీ చేయడం వల్లే ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి కనెక్షన్లు ఇచ్చామని డిస్కం ఏఈ శేషాద్రి వివరణ ఇవ్వగా, విచారించి చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జి తహసీల్దార్ జ్యోతి తెలిపారు.