గొంగటి రఘునాథరెడ్డి కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తుది వీడ్కోలు.

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వింజమూరు

మాజీ మండల కన్వీనర్ రఘునాథ్ రెడ్డి గారి అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

వింజమూరు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మండల కన్వీనర్, మాజీ సొసైటీ చైర్మన్ గొంగటి రఘునాథరెడ్డి అంతిమ యాత్ర కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని తుది వీడ్కోలు పలికారు.రఘునాథ రెడ్డి మృతి పట్ల ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, వింజమూరు మండలంలో పార్టీ అభివృద్ధికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసిన సీనియర్ నాయకుడిగా, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మార్గనిర్దేశం చేసిన వ్యక్తిగా ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.అంతిమ యాత్రలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో పాటు వింజమూరు మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రఘునాథ రెడ్డి కి ఘన నివాళులర్పించారు.