దేశ రాజధానిలో భారీ షాక్: 11 కీలక మెట్రో స్టేషన్లు మూసివేత
రిపోర్టర్: నరేష్
స్థలం: న్యూఢిల్లీ
భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలో పదకొండు కీలక మెట్రో స్టేషన్లలో ప్రవేశ నిష్క్రమణ గేట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు డీఎంఆర్సీ అధికారులు వెల్లడించారు. రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ప్రయాణికులకు ఇంటర్ఛేంజ్ సదుపాయం యథావిధిగా అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. రోజువారీ ఉద్యోగులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.