ముచ్చింతల్ వేదికగా ఈక్వాలిటీ రన్: ఘనంగా ప్రారంభించిన చిన్న జీయర్ స్వామి
రిపోర్టర్: గోపి
స్థలం: గండిపేట
సమానత్వ భావనను చాటేందుకు ముచ్చింతల్ లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఆదివారం ఈక్వాలిటీ రన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని త్రిదండి చిన్న జీయర్ స్వామి, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి జెండా ఊపి ప్రారంభించారని నిర్వాహకులు తెలిపారు. రామానుజాచార్యుల సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా మూడు వందలకు పైగా రన్నర్లు ఉత్సాహంగా పరుగులో పాల్గొని ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు.