రాజకీయ లబ్ధి కోసం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దన్న స్పోర్ట్స్ కోటా టీచర్లు

రిపోర్టర్: విజయ్ స్థలం: విజయవాడ

విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తమ నియామకాలపై అసత్య ప్రచారాలు చేస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దని, ప్రతిభతోనే ఉద్యోగాలు సాధించామని స్పష్టం చేశారు. క్రీడా కోటాను పెంచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.