లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్పై నటుడు నివిన్ పౌలీ కీలక ప్రకటన
రిపోర్టర్: విజయ్
స్థలం: చెన్నై
ప్రముఖ నటుడు నివిన్ పౌలీ నటించనున్న కొత్త చిత్రం బెన్జ్ సినిమా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ చిత్రంలో తాను వాల్టర్ అనే పాత్రలో నటిస్తున్నట్లు నివిన్ పౌలీ వెల్లడించారు. ఈ సినిమాలో కార్తీ నటించిన ఖైదీ చిత్రంలోని దిల్లీ, సూర్య నటించిన రోలక్స్ పాత్రలతో సంబంధం ఉంటుందా లేదా అనే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆ ప్రపంచానికి సంబంధించిన విశేషాలను ఇప్పుడే పూర్తిగా వెల్లడించలేనని తెలిపారు.