చింతలపూడిలో బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుపై రైతుల తీవ్ర ఆందోళన

రిపోర్టర్: రమేష్ స్థలం: Eluru

చింతలపూడి-రేచర్ల ప్రాంతంలో భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రభుత్వ భూముల్లో ప్రయోగాత్మకంగా నిరూపించిన తర్వాతే తమ భూముల గురించి మాట్లాడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పామ్ ఆయిల్ తోటలు, భూగర్భ జలాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం కేవలం మార్కెట్ విలువ కాదని, జీవన ఉపాధి అని రైతులు స్పష్టం చేస్తున్నారు.