ప్రతి అమెరికన్‌కు రూ. 4.2 లక్షలు ఇస్తామన్న ట్రంప్
రిపోర్టర్: విజయ్
స్థలం: అమెరికా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ ఇచ్చారు. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయం సాధిస్తే, ప్రతి వయోజన అమెరికన్‌కు ‘ట్రంప్ డివిడెండ్’ పేరుతో 5వేల డాలర్లు (సుమారు రూ. 4.2 లక్షలు) చెల్లిస్తామని ప్రకటించారు. డల్లాస్‌లో జరిగిన రిపబ్లికన్ల సదస్సులో మాట్లాడుతూ, ఎన్నికల్లో తాను పోటీ చేయకపోయినా బ్యాలెట్‌లో ఉన్నట్లు భావించి పార్టీకి ఓటేయాలని మద్దతుదారులను కోరారు.