ఆంధ్రప్రదేశ్ లో జనవరిలో ఘనంగా నంది నాటకోత్సవాలు
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినీ, నాటకరంగానికి పూర్వవైభవం తీసుకొచ్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. అమరావతిలోని వెలగపూడి సచివారయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, తెనాలి వేదికగా జనవరిలో నంది నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసి, డిసెంబరులో ప్రాథమిక జాబితా ప్రకటించి, జనవరిలో విజేతలకు పురస్కారాలు అందజేస్తామన్నారు. కందుకూరి పురస్కారాలను 3 నుంచి 5కు పెంచి రూ.లక్ష నగదు బహుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో సినిమా, టీవీ రంగాల నంది అవార్డుల ప్రదానం త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.