తుఫాన్ల తాకిడిపై సీఎం చంద్రబాబుతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ
రిపోర్టర్: రమేష్
స్థలం: Andhra Pradesh
వారం రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు తుఫాన్ల తాకిడి నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్ లో పరిస్థితిపై సీఎం శ్రీ నారా చంద్రబాబునాయుడుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఫోన్ ద్వారా ఆరా తీశారని సీఎంవో ఆంధ్రప్రదేశ్ వెల్లడించింది. ఈ సందర్భంగా తుఫాన్ల వల్ల రాష్ట్రంలో జరిగిన ఆస్తినష్టం, పంట నష్టం తదితర వివరాలను సీఎం ప్రధానికి పూసగుచ్చినట్లు వివరించారు. కేంద్రం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలిపారు.