విద్యుత్ పొదుపులో అధికారులే ఆదర్శంగా నిలవాలి: కలెక్టర్ ప్రియాంక అల హెచ్చరిక
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ ఆదా చేయడం అత్యంత కీలకమని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల స్పష్టం చేశారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ శాఖలన్నీ విద్యుత్ పొదుపులో ముందుండి ఆదర్శంగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యాలయాల్లో ఏసీ ఉష్ణోగ్రతలను తప్పనిసరిగా ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ వద్ద సెట్ చేసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.