ఢిల్లీ హోటల్‌లో భార్య దారుణ హత్య, ఆత్మహత్యకు భర్త యత్నం
రిపోర్టర్: రాము
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలోని లాహోరీ గేట్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్‌లో శివాని కుమారి అనే మహిళను ఆమె భర్త ప్రకాష్ సింగ్ కత్తితో పొడిచి చంపాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ దారుణం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. భార్యను హత్య చేసిన అనంతరం ప్రకాష్ విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రస్తుతం నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.