ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తుల పరిశీలన శరవేగంగా పూర్తి

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భరోసా పథకం కింద కొత్త పెన్షన్ల మంజూరుకు దరఖాస్తుల పరిశీలన శరవేగంగా కొనసాగుతోంది. ఈనెల 7 నుంచి 18 వరకు స్వీకరించిన దరఖాస్తులను అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. మొత్తం 19,631 మంది దరఖాస్తులు సమర్పించగా, ఈ నెల 21 నుంచి డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ జయకృష్ణ ఆధ్వర్యంలో పరిశీలన ప్రారంభమైంది. శనివారం నాటికి 17,867 దరఖాస్తులను అర్హతగా గుర్తించామని, 1,752 తిరస్కరించామని సత్యనారాయణ తెలిపారు.