తిరుపతిలో కారులో మర్చిపోయిన ఫోన్ను సీసీ కెమెరాల సాయంతో రికవరీ చేసిన పోలీసులు

రిపోర్టర్: RAVI BABU స్థలం: వెదురుకుప్పం

రాజమండ్రికి చెందిన సాయి స్వరూప్ రాజు తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం వద్ద కారులో మర్చిపోయిన రూ.35 వేల విలువైన సాంసంగ్ ఫోన్ను జిల్లా పోలీసులు సురక్షితంగా రికవరీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది సీసీ కెమెరాల దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. AP 03 TL 3205 నంబరు గల కారును గుర్తించి డ్రైవర్ హర్షవర్ధన్ ద్వారా ఫోన్ను తెప్పించి బాధితుడికి అందజేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా స్పందించిన తిరుపతి పోలీసులకు భక్తుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.