గణేష్ నిమజ్జన వేడుకల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
నర్సీపట్నం టౌన్ సీఐ గఫూర్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ మరియు డీజే సౌండ్ సిస్టమ్ నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి శబ్ద పరిమితులు పాటించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, మద్యం సేవించి ఊరేగింపుల్లో పాల్గొనకుండా ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాలని హెచ్చరించారు.