ఓబులవారిపల్లెలో పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ఘట్టం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఓబులవారిపల్లె

తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మూడో రోజు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసింది. నామినేషన్ల దాఖలుకు ఇదే చివరి రోజు కావడంతో మండల ప్రజా పరిషత్ మరియు తహసీల్దార్ కార్యాలయాల వద్ద అభ్యర్థులు, మద్దతుదారుల కోలాహలం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ముందస్తుగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు.