ఢిల్లీ పోలీసులపై యూట్యూబర్ ధ్రువ్ రాథీ సంచలన ఆరోపణలు
రిపోర్టర్: సురేష్
స్థలం: న్యూఢిల్లీ
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తాను నిరసన తెలిపిన సమయంలో కొంతమంది ఢిల్లీ పోలీసు సిబ్బంది తనకు అంతర్గతంగా మద్దతు తెలిపారని ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాథీ వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమంలో తనను అక్రమంగా నిర్బంధించిన విషయమై పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకున్నానని ఆయన పేర్కొన్నారు. అయితే ఉద్యోగాలు కోల్పోతామనే భయంతో ఆ సిబ్బందిని క్షమించానని రాథీ తెలిపారు.