న్యాయవాదులకు ఫీజుల చెల్లింపుపై హైకోర్టు కీలక ప్రశ్నలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమరావతి

రాష్ట్ర ప్రభుత్వం తరఫున కీలక కేసులలో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు ఫీజుల చెల్లింపు నిమిత్తం జారీచేసిన జీవోలను రద్దుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది. న్యాయవాదులకు ప్రభుత్వం ఫీజులు చెల్లించడం ఇదే మొదటిసారి కాదని, గత చెల్లింపులపై అభ్యంతరం ఎందుకు లేవనెత్తలేదని పిటిషనర్ వేము కొండలరావును ధర్మాసనం ప్రశ్నించింది. ఈ విషయంలో పలు న్యాయస్థానాలు ఇప్పటికే తీర్పులిచ్చాయని, వాటిని అధ్యయనం చేసి కోర్టు ముందుంచాలని స్పష్టంచేస్తూ విచారణను వాయిదా వేసింది.